ఇదేంపని జేసీ… మరోసారి గట్టిగా కొట్టిన ఆర్టీఏ!

-

అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఆర్టీఏ ఎన్నివాహనాలు సీజ్ చేసినా వారి పద్దతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.. ప్రజల ప్రాణాలంటే లెక్కచేయడం లేదు! అవును… తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ లు చేయించుకుని బస్సులు నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. బీఎస్ – 3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారని నిర్ధారణకు కూడా అధికారులు వచ్చారు. ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కూడా ఇలాంటి చిల్లరపనులకు జేసీ బ్రదర్స్ తెగించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… జేసీ బ్రదర్స్‌ కు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మరోసారి జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. బీఎస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో వాహనాలు సీజ్ అయ్యాయి. వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు! ఈ క్రమంలో జేసీ ట్రావెల్స్‌కు చెందిన 4 టిప్పర్లను అధికారులు సీజ్‌ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54 వాహనాలను రవాణాశాఖ సీజ్‌ చేసింది. ఈ పద్దతిలో మెయింటైన్ చేస్తున్న మరో 97 బస్సులు, లారీలను రహస్య ప్రదేశాల్లో దాచినట్లు చెబుతున్నారు. గతంలో కూడా జేసీ ట్రావల్స్ కు సంబందించిన 57 వాహనాలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తప్పులు చేయడం పనిగా పెట్టుకున్నారో లేక ప్రజల ప్రాణాలను గడ్డిపోచలుగా ఎంచుతున్నారో తెలియదు కానీ… ఇలా తప్పుగా బీఎస్ – 3 వాహనాలను, బీఎస్ – 4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారు జేసీ బ్రదర్స్! కాగా… ఈ విషయాలపై స్పందించినప్పుడల్ల జేసీ బ్రదర్స్ తమ అడ్డగోలు వాదనలు వారు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌ కు తమ బస్సులే కనిపిస్తున్నాయా అని.. తమను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారే తప్ప.. అధికారుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని మాత్రం చెప్పడం లేదు!

Read more RELATED
Recommended to you

Latest news