జగన్ డిక్లరేషన్ తీసుకోండి.. ఈవోకు టీడీపీ నేతల లేఖ !

-

టీటీడీ ఈవోకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామి వారి దర్శనానికి ముందు డిక్లరేషన్ తీసుకోవాల్సిందిగా కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరిలు లేఖలో కోరినట్టు సమాచారం. ఆలయాలపై జరుగుతున్న దాడులు విషయంలో రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంటుందని, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నానిలు చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనసులను గాయపరుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. వీరి ప్రవర్తన హైందవ సంస్కృతిపై కుట్రపూరితమైన దాడిగా కనిపిస్తుందని, మంత్రుల వ్యాఖ్యలతో పాటు ముఖ్యమంత్రి వ్యవహారశైలి కూడా మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.

హైందవ ఆలయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి డిక్లరేషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా బాద్యతా రాహిత్యంగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దల మనసులో ఏదో దురుద్దేశం ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నరనే అనుమానం ఉందని వారు పేర్కొన్నారు. స్వామి వారి దర్శనం విషయంలో ఆలయ నిబంధనలు విధిగా పాటించాలని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత టీటీడీ పాలకమండలి పై ఉందని లేఖలో పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో ముఖ్యమంత్రి స్వామి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే తప్పనిసరిగా సీఎం జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news