ముఖ్యమంత్రి డిక్లరేషన్ లో సంతకం పెట్టాల్సిందే అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. కోట్లాది ప్రజల మనోభావాలను, విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. డిక్లరేషన్ పై సీఎం సంతకం చేయకుంటే, హిందు మతంపై దాడులను మరింత పెంచిన వారవుతారని దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగాయని వ్యాఖ్యానించారు.
వాటన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు ఆయన. ఏనాడూ ముఖ్యమంత్రి వాటిపై స్పందించ లేదు అని పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అంతరంగానికి అద్దం పడుతున్నాయని దేవినేని ఉమా ఆరోపించారు. అదే విధంగా హిందూ మతాన్ని కించ పరిచేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు తీసుకోవడానికి జగన్ ఎందుకు వెనకాడుతున్నారు? అని దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.