ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం అయినప్పటి నుంచి వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది.

పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు…ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినదాలు చేశారు. ఈ తరుణంలోనే… ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని.