పితానిని పట్టుకెళ్లిపొతే… టీడీపీ స్కెచ్ రెడీ!

-

అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, నిస్సిగ్గు పనులు… ఇలా రకరాకాల వ్యవహరాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదవుతుండటం.. వరుసగా అరెస్టు ప్రక్రియలు జరుగుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈఎస్ ఐ అవినీతి కేసులో అచ్చెన్నాయుడు ఇప్పటికే అరెస్టవ్వడం.. విచారణ జరగడం తెలిసిన క్రమంలో… తాజాగా మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయనతోపాటు ఆయన కుమారుడు, మాజీ పీఎస్ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. ఈ సమయంలో పితానికి పోలీసులు అరెస్టుచేస్తే అనే విషయంలో టీడీపీలో చర్చలు నడుస్తున్నాయంట!


ప్రస్తుతం అన్నీ ఆందోళనకరమైన చర్చలు టీడీపీ అంతర్గత భేటీల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడి అరెస్టుతో మొదలైన ఈ ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో పితాని సత్యనారాయణ కుమారుడు, పితాని మాజీ పీఎస్ లు ముందస్తు బెయిల్ కోసం హైకొర్టును ఆశ్రయించినప్పుడే… నెక్స్ట్ వీళ్లే అనే క్లారిటీ వచ్చేసింది. అనంతరం మాజీ పీఎస్ ను అధికారులు అదుపులోకి తీసుకోవడంతో… నెక్స్ట్ కచ్చితంగా పితానిపైనే ఏసీబీ గురి పెట్టే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఇంతకాలం తీసిన “బీసీ కార్డు” స్థానంలో మరో కార్డు ప్రయోగించాలని ఆలోచిస్తున్నట్లుగా ఉంది!

అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు… ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఉపయోగపడిన బీసీ కార్డు… కొల్లు రవీంద్ర విషయంలో అక్కరు రాలేని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పితాని విషయంలో కూడా బీసీ కార్డును తీయకుండా.. అందులో సబ్ క్యాస్ట్ కార్డును తీయనుంది టీడీపీ!! అందులో భాగంగా హింట్ ఇచ్చిన నిమ్మల రామానాయుడు… గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ వర్గానికి చెందిన 80శాతం ప్రజలు తెదేపా వైపు ఉన్నారనే కక్షతోనే మాజీ మంత్రి పితాని సత్యనారాయణను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు.

ఇంతకు మించిన దిగజారుడు విమర్శ మరొకటి ఉండదనేది వైకాపా నేతల మాటగా ఉంది! అవినీతికేసులో అరెస్టయితే బీసీలను అణగదొక్కే కార్యక్రమం అన్న నేతలు… జేసీ, చింతమనేనిని అరెస్టు చేస్తే నోరూ మెదపలేదు!! కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే.. మళ్లీ బాబు & కో లు బీసీ కార్డు తీసేలోపు.. వైకాపా నుంచి ఫుల్ రివర్స్ కౌంటర్స్ రావడంతో సైలంట్ అయిపోయారు! మళ్లీ పితాని విషయానికి వచ్చేసరికి… ఏకంగా శెట్టిబలిజీల్లో అధికులు టీడీపీవైపు ఉండటం వల్లనే అని మాట్లాడుతున్నారు. ఈ విమర్శలపై గోదావరిజిల్ల శెట్టిబలిజలనుంచి ప్రతివిమర్శలు రావడం కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news