ప్రతిపక్ష పార్టీ ప్రధాన కర్తవ్యం ఏంటి? అని ఎవరిని అడిగినా వెంటనే చెప్పే సమాధానం.. ప్రజా కోణంలో ఆలోచించి.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై విమర్శలు చేయడం-అనే చెబుతారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే చేస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఇలానే చేసి నా .. ఇప్పుడు ఇక సబ్జెక్టులు ఏమీ కనిపించడం లేదట! దీంతో ప్రబుత్వాన్ని ఎలా విమర్శించాలా? అని టీడీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఇక, ఏ విషయమూ లేక పోవడంతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెం కట్రావు.. పసలేని విమర్శ ఒకటి నిన్న మీడియాకు వదిలారు.
రాష్ట్రంలో ఉపాధి కల్పనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్త యినా.. ఇప్పటి వరకు ఎలాంటి రిక్రూట్‌మెంట్ చేపట్టలేదని కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. వాస్తవాని కి రాష్ట్రంలో జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత లక్షల సంఖ్యలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చే శారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. సెక్రటరీ పోస్టులను సృష్టించారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల మంది యువతకు ఉపాధి లభించింది.
ఇక, ఇతర ఉద్యోగ నియామకాలను కూడా చేపడుతున్నారు. ఈలోగానే కరోనా కల్లోలం తెరమీదికి వచ్చింది. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ అధ్యక్షుడు కళా ఇలా ఆరోపణలు సంధించడం వెనుక.. తమ్ముళ్ల మధ్యే ఆసక్తి కర చర్చ సాగుతుండడం గమనార్హం. అన్నా.. విషయంలో పసలేదన్నా.. అంటూ.. తమ్ముళ్లే ఫోన్లు చేసుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శించేందుకు తమ్ముళ్లకు ఎలాంటి అవకాశం ఉండడం లేదట. దీంతో ఏదో ఒక విషయం పట్టుకుని ఇలా విమర్శిస్తున్నా రని తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. అంటే.. మొత్తంగాఇప్పుడు టీడీపీ నేతలకు విమర్శించేందుకు విషయం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తున్నది. మరి మున్ముందు ఏమైనా దొరుకుతుందో లేదో చూడాలి.