తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను తాజాగా అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇటీవలే టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తొలిజాబితాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడు 34 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. రాజమండ్రి రూరల్-గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తిపాడు- వరుపుల సత్యప్రభ, రంపచోడవరం మిర్యాల-శిరీష, గుంటూరు వెస్ట్ : పిడిగురాళ్ల మాధవి, కందుకూరు-ఇంటూరు నాగేశ్వరరావు, గిద్దలూరు-అశోక్ రెడ్డి, కొవ్వూరు- వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, దెందులూరు-చింతమనేని ప్రభాకర్, గోపాలపురం- మద్దిపాటి వెంకటరాజు లను ప్రకటించారు.
వీరితో పాటు మాడుగుల-పైళ్ల ప్రసాద్, పెదకూరపాడు-భాష్యం ప్రవీన్, ఆత్మకూరు-ఆనం రాంనారాయణరెడ్డి, వెంకటగిరి-లక్ష్మీప్రియ, పుంగనూరు-చల్లా రాంచంద్రారెడ్డి, పూతలపట్టు-మురళిమోహన్, గాజువాక – పల్లా శ్రీనివాసరావు వంటి తదితరులను రెండో జాబితాలో ప్రకటించారు చంద్రబాబు. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇవాళ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కేవలం 34 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. త్వరలోనే మిగిలిన వారిని ప్రకటించనున్నట్టు సమాచారం.