షర్మిల ఉన్నా..ఇండియా కూటమిలో జగన్‌ చేరడం ఖాయం – యనమల

-

షర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల.అసెంబ్లీ లాబీల్లో యనమల, విష్ణుకుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల మాట్లాడుతూ…ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… జగనుకు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని పేర్కొన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల.

TDP senior MLC Yanamala comments on jagan

ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలని… జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం అని తెలిపారు. ఇండియా కూటమిలో చేరడం జగనుకు అనివార్యమని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని… ఇప్పుడు ఎన్డీఏలో మేము. జనసేన ఉన్నామన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల. ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి ఉందని చురకలు అంటించారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల.

 

Read more RELATED
Recommended to you

Latest news