మడకశిరలో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు TDP పార్టీ కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర TDPలో అసంతృప్తి భగ్గుమంది. టిడిపి అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చి ఎంఎస్ రాజు సీటు కేటాయిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయుల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మడకశిరలో టిడిపి కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఆందోళనకు దిగారు. అంతేకాదు… టీడీపీ ప్లెక్సీలు చింపివేసి దహనం చేశారు కార్యకర్తలు. మాట ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారంటూ నినాదాలు చేశారు. ఎంఎస్ రాజు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు.