ఆ విషయంలో టీడీపీకి గాత్రదాతలు కావలెను… అర్హతలు ఇవే!

-

ప్రస్తుతం టీడీపీ తరుపున కాస్త గట్టిగా మాట్లాడే నేతలు కరువైపోయారనే వాదనలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. అమరావతి నుంచి పూర్తి రాజధానికి విశాఖకు తరలిస్తోన్న నేపథ్యంలో… ప్రతిపక్షాల వాయిస్ ని గట్టిగా వినిపించే నాథుడే టీడీపీలో కరువయ్యాయరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తమ్ముళ్లు అచ్చెన్నను గుర్తుకు చేసుకుంటున్నారు!

బోండా ఉమ, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, బాబు రాజేంద్రప్రసాద్ వంటి నేతలు కాస్త వాయిస్ వినిపిస్తున్నప్పటికీ… వారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నేతలు కావడంతో వారి వాయిస్ కి అంతవిలువ ఉండటం లేదు. మరోపక్క ఇటు గుంటూరు – కృష్ణా నుంచి, అటు ఉత్తరాంధ్ర నుంచి వైకాపా తరుపున బలమైన వాయిస్ లు వినిపిస్తున్నాయి.ఈ సమయంలో ఉత్తరాంధ్ర జిలాలనుంచి బాబుకు గాత్రదాతల అవసరం ఏర్పడింది. దీంతో అచ్చెన్నా ఉంటే… బాబుకు ఆ లోటు తెలియనివ్వకుండా చేసేవారనే కామెంట్లు పడుతున్నాయి.

ఒకప్పుడు టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలంగా ఉండేది. ఫ్యాన్ గాలి అత్యంత బలంగా వీచిన సమయంలో కూడా విశాఖలో నాలుగు సీట్లు గెలవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినా కూడా ఉత్తరాంధ్ర వైపునుంచి బాబుకు సరైన సపోర్ట్ కొరవడింది. ఈ సమయంలో సీమ నేతలు అయినా స్పందిస్తారనుకుంటే… పరిపాలనా రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయండనే కామెంట్లు వారు చేస్తున్నారు!

దీంతో… ఈ సమయంలో టీడీపీకి గాత్రదాతలు కావాలనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందినవారు అయ్యి ఉండకూడదు అనేది ఒక అర్హత కాగా… ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారు, ప్రత్యేకంగా విశాఖకు చెందినవారు అయ్యి ఉండాలనేది మరో అర్హతగా చెబుతున్నారు!! మరి బాబుకు ఆ లోటు పూడ్చబడుతుందా… అచ్చెన్న లేని ఆ లోటును ఎవరు భర్తీ చేయగలరు?

Read more RELATED
Recommended to you

Latest news