ఏపీ- తెలంగాణ బోర్డర్ లో ఉద్రిక్తత !

-

ఎన్నికల దృష్ట్యా ఓటర్లు సొంతూళ్ళకి బయలుదేరారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏపీ ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నారు. విజయవాడ హైవేపై రద్దీ నెలకొనగా టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

telangana ap border traffic

మరోవైపు హైదరాబాద్ రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ‘డీడూప్లికేషన్ సాఫ్ట్ వేర్’ అమలు చేయకపోవడంతో కొందరు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లోను ఓటు వేసి ఇప్పుడు APకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అటు వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఈ సందర్బంగా వైసీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాగా, నంద్యాల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున సతీమణి అల్లు స్నేహారెడ్డి తో కలిసి బన్నీ ప్రచారం చేసారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా 2019 సంవత్సరంలోను విశేష్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news