వివేకా హత్య కేసులో నేడు తెలంగాణ హై కోర్టులో విచారణ జరుగనుంది. వివేక హత్య కేసు పై కోర్ట్ లో అవినాష్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి స్టే నేటితో ముగియనుంది. నేటి వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు పేర్కొంది.
ఈ తరుణంలోనే, అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు లో నేడు విచారణ జరుగనుంది.
అవినాష్ రెడ్డిని విచారించిన కేసు డైరీ ని కోర్ట్ కు షీల్డ్ కవర్ లో సమర్పించనుంది సి బి ఐ. ఇక అవినాష్ రెడ్డి పిటిషన్ లో ఇంప్లీడ్ అయింది వివేకా కూతురు సునీత. నేడు వాదనలు కొనసాగనున్నాయి. ఇక నిన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.