తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… తెలంగాణ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు… తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకటించారు. అంతేకాకుండా మళ్లీ తెలుగుదేశం తెలంగాణ నేతలను… తట్టి లేపుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇలాంటి నేపథ్యంలోనే… తెలంగాణ టిడిపి బాధ్యతలను నారా లోకేష్ అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారట నారా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తే… పార్టీ బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారట. యంగ్ లీడర్ కావడంతో నారా లోకేష్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నారా.. చంద్రబాబు నాయుడు ఆలోచనకు వచ్చారట. అలాగే.. నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మినికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారట. మరి నారా చంద్రబాబు నాయుడు వేస్తున్న ఈ అడుగులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.