దసరా ముగిసింది. దేవరగట్టు యుద్ధానికి తెరలేచింది. మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సిర్వం సిద్ధం. మరి ఈసారైనా ఖాకీల వ్యూహం కర్రల యుద్ధాన్ని కట్టడి చేస్తుందా? ఓవైపు కర్రలకు రింగులు పడుతున్నాయి. మరోవైపు ఖాకీల నిఘా పెరిగింది. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీనే.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై కొలవైన మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో చరిత్ర వుంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తోంది.కొన్ని ఏళ్లుగా దేవరగట్టు లో జరిగే బన్నీ ఉత్సవానికి ఈ కొట్లాటల వల్లే కర్రల సమరం గా పేరు వచ్చింది. ఇది సమరం కాదు. సంప్రదాయం అంటారు భక్తులు.
బన్నీ ఉత్సవాలుకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవాలు ముగిసే వరకు చాలా నిష్టతో వుంటారు. మాలమల్లేశ్వరీ స్వామి కల్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను తరలించే క్రమంలో కర్రల సమరానికి తెరలేస్తోంది. దాదాపు 11 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవం పై ఇతర గ్రామాల నుంచే వచ్చే భక్తులు వర్గాలు విడిపోయి కర్రలతో సమరానికి దిగుతారు.ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట వద్దకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం ముగుస్తుంది..అప్పటి వరకు టెన్షన్.. టెన్షన్ వాతావరణం ఉంది.