తెలంగాణ ఎన్నికల ప్రచారం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. సూర్యపేట ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా సభ ఏర్పాట్ల కోసం సూర్యపేటకు వెళ్తున్నారు బీజేపీ నేతలు. ఈనెల 31న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు రానున్నారని తెలుస్తోంది. ఈనెల 28, 29 తేదీల్లో అస్సోం సీఎం కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారని సమాచారం.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక అమిత్ షా రాష్ట్రానికి రావడం ఇది రెండవ సారి. అంతకు ముందు రాష్ట్రానికి వచ్చిన ఆయన ఆదిలాబాద్ లో పర్యటించారు. తెలంగాణలో 2023 నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో లిస్ట్ రిలీజ్ పై దృష్టి సారించనుంది. మరో రెండు, మూడు రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.