GPF నిధులపై జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ !

-

GPF నిధులపై జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఆ నిధులను జగన్‌ సర్కార్‌ కాజేసినట్లు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. లోక్‌సభలో నిన్న టీడీపీ విజయవాడ ఎంపి శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) GPF నిధులపై ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలియ పరచకుండా, వారి సమ్మతి లేకుండా ఉద్యోగుల జిపిఏఫ్ ఖాతాల నుండి 2021 మరియు 2022 సం.రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిపిఏఫ్ సొమ్ము రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సమ్మతితోనే విత్ డ్రా చేసిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ వేదికగా కేశినేని నాని అడిగారు.

అయితే.. కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. 2021, 2022 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి 68020 జిపిఏఫ్ ఖాతాలలో అంతకు మునుపు జమ చేసిన డిఎ మొత్తం నుండి రూ. 413.73 కోట్లు డిఎ బకాయిలు విత్ డ్రా చేశారని సమాధానం ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్. ఇక కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ సమాధానం వినగానే.. టీడీపీ ఎంపీలు.. తమ నిరసనను తెలిపారు. ఏపీ ప్రభుత్వం దారుణానికి పాల్పడిందని ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news