వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ టీజీ వెంకటేష్. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఖరారు అవుతాయని వెల్లడించారు. అయితే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ఏపీ ప్రభుత్వానికి తప్ప వైసీపీకి కాదంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పర్సనల్ ఎటాక్ చేసి.. వైసిపి ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు టీజీ వెంకటేష్. అయితే పవన్ కళ్యాణ్ బిజెపితోనే ఉంటారనే ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారును అధికార పీఠం నుంచి కిందికి దించడమే బిజెపి ఎజెండా అని, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటారని భావిస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి వైసీపీకి మద్దతు ఇస్తుందన్న తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు.