పోలీసులపై హాట్ కామెంట్స్ చేసిన తమ్మినేని సీతారాం..!

-

పలాసలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసుల పై హాట్ కామెంట్స్ చేసారు. ఈ రాష్ట్రంలో సుమారు 70, 80 హత్యలు, ఆత్మహత్యలు, రేప్ లు జరిగాయి అని పేర్కొన తమ్మినేని సీతారాం.. పోలీసు వ్యవస్థ మీ ఆధీనంలో లేదు. కలెక్టర్, ఎస్పీ లను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే భయపడుతున్నారు. రాష్ట్రంలో 40 స్కీమ్ లు పెట్టారు. ఒక్క స్కీమ్ అయినా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

అయితే తల్లికి వందనం లేదు, తండ్రికి ఇందనం ఇస్తున్నారు అని పేర్కొన్నారు. ఇక రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్తే స్టేషన్లో పెట్టి కొడతారా… ఇది రాక్షసత్వమా… ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు. స్టేషన్లో పెట్టి కొడుతుంటే పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు. అసలు ఏంటీ దారుణం.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగిన ఆయన.. మా హయాంలో ఇటువంటి అరాచకాలు చేశామా అన్నారు. అలాగే పోలీసులు చాలా స్పష్టంగా మీ విధులు మీరు నిర్వర్తించండి అని సూచించారు తమ్మినేని.

Read more RELATED
Recommended to you

Latest news