సునామిలా తరలివచ్చిన మీ అందరికీ థ్యాంక్స్.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహాలం ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ క్రమంలో పోలింగ్ పై  సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

CM Jagan

ఏపీలో ఎన్నికలు ముగియండంతో ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది..? టీడీపీ కూటమి పవర్లోకి వస్తుందా..? మరోసారి జగన్ సీఎం అవుతారా..? అనే అంశాలపై స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరీ ఏపీలో ఏ పార్టీ అధికార పీఠం దక్కించుకుంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news