అందుకన్నమట అచ్చెన్నను అరెస్ట్ చేసింది… కార్డు లేదు!

-

అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ.ఎస్.ఐ. మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిన కేసుకు సంబందించి! ఇది ఎవరిని అడిగినా చెబుతారు! కానీ తనను అరెస్ట్ చేసింది అందుకు కాదంటూ కబుర్లు చెబుతూ.. తాను చాలా గొప్పవాడిని, పోరాట యోదుడిని అన్న రేంజ్ లో కబుర్లు చెప్పుకొస్తున్నారు అచ్చెన్నాయుడు.

నీతిగా ఉన్నందుకే తనను అరెస్ట్ చేశారు.. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారంటూ చెప్పుకొస్తున్నారు అచ్చెన్నాయుడు. అరెస్టయ్యిందే అవినీతి కేసులో… మరి ఇంకెక్కడ నీతిగా ఉన్నట్లు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారంటున్నారు.. ప్రభుత్వం ఏమేమి అవినీతులు చేసేసింది.. తానేమి ప్రశ్నించేశారు.. ఏమి పోరాటాలు చేసేశారు.. అసెంబ్లీలో హడావిడి తప్ప.

ఈ విషయాలు ప్రజలకు తెలియదులే, ప్రజలు గ్రహించలేరులే అని ఇంకా అనుకుంటున్నారో ఏమో కాని.. తన అరెస్టుపై అలాంటి వివరణ ఇచ్చి.. తాను చంద్రబాబు తర్వాత అత్యంత నీతిపరుడిని అన్న రేంజ్ లో చెప్పుకొస్తున్నారు అచ్చెన్న. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… అచ్చెన్న అరెస్టయిన కొత్తలో బాబు వాడిన “బీసీ కార్డు” టాపిక్కే అచ్చెన్న ఎత్తలేదు.. ఎందుకంటే అది పారలేదు కదా!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news