ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల దుర్మరణం!

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తాజాగా సమాచారం ప్రకారం… ఫిబ్రవరి 29 పెళ్లి జరిగి రెండు రోజుల క్రితం షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తేలింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు మృతి చెందారు. అంటే పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల దుర్మరణం అయ్యారని పోలీసులు గుర్తించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news