రిజిస్ట్రేషన్ల ఒరిజనల్ డాక్యుమెంట్స్ ఉండవని జరుగుతోన్న ప్రచారంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయింది. డిజిటల్ సైన్ ఉన్న ఫిజికల్ డాక్యుమెంటుని రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం…. జిరాక్స్ కాగితాలే ఇస్తారనే తరహా ప్రచారం ఎవరు చేస్తున్నారనే అంశంపై ఆరా తీసింది. పలువురు డాక్యుమెంట్ రైటర్లే ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందుతోంది.
కొందరు డాక్యుమెంట్ రైటర్లు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్ధారణకు వచ్చింది జగన్ సర్కార్. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లోని డాక్యుమెంట్ రైటర్ల ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్నారని గుర్తించింది. తప్పుడు ప్రచారం చేస్తోన్న డాక్యుమెంట్ రైటర్ల జాబితాను సిద్దం చేస్తోన్న సర్కార్… నిందితులపై చర్యలు తీసుకోనుంది.