భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం..ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు క్రాస్‌

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గడిచిన ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు క్రాస్‌ అయింది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. పిభ్రవరి మాసంలో శ్రీవారిని 18.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే, ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు క్రాస్‌ అయింది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అలాగే, 92.96 లక్షల లడ్డుల విక్రయాలు జరిగాయి. అటు 7.21 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 34.06 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఇక మార్చి నెలలో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు టీటీడీ పాలక మండలి తెలిపింది.