ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై టిడిపి గోడ మీద పిల్లిలా వ్యవహరించిందని ఆరోపించారు వైఎస్ఆర్సిపి ఎంపీ మార్గాని భరత్. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై టిడిపి ఎందుకు ఓపెన్ గా తన అభిప్రాయం చెప్పలేదని ప్రశ్నించారు. సభలో కూర్చుని బిజెపికి కోపం రాకుండా జాగ్రత్తపడ్డారని ఎద్దేవా చేశారు. ఎఫ్ఆర్బీఎం కు లోబడే ఏపీ అప్పులు ఉన్నయన్నారు. గడచిన నాలుగు ఏళ్లలో 1,70,000 కోట్ల అప్పు మాత్రమే ఏపీ ప్రభుత్వం చేసిందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
విద్య, వైద్యం రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మార్గాని భరత్. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంలో ప్రస్తావిస్తామన్నారు. ఏపీ విభజన చట్టం సవరణ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నామని తెలిపారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడతామన్నారు. లోకేష్ ఒక పప్పు సుద్ద అని విమర్శించారు భరత్. వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా అద్భుతంగా పని చేస్తున్నారని గడ్కరీ కితాబు ఇచ్చారని తెలిపారు.