ప్రపంచం నలుమూలలకు అ్కడి చేపలు ఎగుమతి అవుతున్నాయ్. కాన్నీ అక్కడి మత్య్సకారుల సమస్యలు మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు. ఇదే ఆవేదనను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ దృష్టికి తీసుకెళ్ళారు ఫిషింగ్ కోఆపరేటివ్ సొసైటీ జీడిమెట్ల అధ్యక్షులు చిలుకూరు కృష్ణముదిరాజ్. ఏళ్ళ తరబడి చెరువులను కాపాడుకుంటూ చేపల వేటను జీవనోపాధిగా మార్చుకుని జీవితీస్తున్నామని చెప్పిన కృష్ణముదిరాజ్….స్థానికంగా మత్య్సకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే వివేకానంద్‌కి వివరించారు. వినతిపత్రం అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అభ్యర్ధించారు.వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలు నొప్పించి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు.
వినతిపత్రంలో ఏఏ సమస్యలు ఉన్నాయంటే….మత్య్సకారులు ఉపాధి పొందుతున్న చెరువులకు ఎఫ్‌టిఎల్ హద్దులు ఉన్నాయి. అయినప్పటికీ అవి ఆక్రమణకు గురవుతున్నాయి. దురాక్రమణల నుంచి చెరువులను కాపాడాలని ఆయన వినతిపత్రంలో కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతువేదిక ఏర్పాటు చేసినట్లు మత్య్సకారులకు కూడా ఓ వేదిక ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
వలలు,వస్తువులు,పడవలను భ్రదపరచుకునేందుకు స్టోర్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని, మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల కార్యవర్గ సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని,55 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఐదేళ్ళకోసారి సొసైటీలను రెన్యువల్ చేయాలనే నిబంధనతో ఆర్ధికంగా నష్టపోతున్నామని దీనివలన చెరువులపై హక్కులు కోల్పతున్నామంటూ ఆవేదనను వెల్లగక్కారు.మత్య్సశాఖలో ఉండే సంఘాలకు వేరువేరుగా అధ్యక్షులను ఏర్పాటు చేయడం వలన సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. చేపలకు మార్కెట్ విలువ పెంచి ఆర్ధికంగా తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు.
ఏళ్ళ తరబడి చెరువులను కాపాడుతున్న తనలాంటి మత్య్సకారుల సంక్షేమం కోసం సహకారం అందించాలని కోరారు. అలాగే వినతిపత్రంలో చెప్పిన సమస్యలు ఎవ్వరినీ నొప్పించేందుకు కాదని చెప్పిన కృష్ణముదిరాజ్….అలాంటి పాయింట్స్ ఏవైనా ఉంటే క్షమించాలని అన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా బాధలు ఉన్నాయని చెప్తూ. . . . ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆర్ధిక ఇబ్బందులను తొలగించాలని,మత్య్సకార్మిక సొసైటీలను ఉణికి కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో పాటు మత్య్సశాఖ సమాఖ్య ఛైర్మన్ పిట్టల రవీందర్, యానిమల్ హజ్బెండరీ,ఫిషరీస్,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కమిషనర్ లచ్చిరామ్ భూక్య…తదితరులకు వినతులను పంపారు. త్వరగా సమస్యలపై స్పందించి పరిష్కార మార్గం చూపాలని కోరారు.