ఎన్టిఆర్ జిల్లాలో విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఎస్ఎల్ వీ ఫైనషియల్ సర్వీస్ ఏజెన్సీకి చెందిన ప్రతినిధులను అరెస్ట్ చేశారు.నందిగామ ఏసీపి నాగేశ్వరరెడ్డి సమక్షంలో వత్సవాయి పీఎస్ లో నిందితులను విచారణ చేపడుతున్నారు.
ప్రస్తుతం పోలీస్ ల అదుపులో ముగ్గురు మేనేజర్లు , నలుగురు రికవరీ ఏజెంట్లు ఉన్నారు.
మేనేజర్లు చలువ మున్నేధర్ రెడ్డిసింగిరెడ్డి వెంకటేశ్వరావు , బూరుగు మాధురి. అలాగే..రికవరీ ఏజెంట్లు చిర్రా పవన్ కుమార్,
కురుషోటి భాగ్యతేజ ,చల్లా శ్రీనివాసరావు , గజ్జలకొండ వెంకట శివ నాగరాజుగా పోలీసులు గుర్తించారు.ప్రధాన సూత్రదారులు చిర్రా పవన్ , కురుషోటి భాగ్యతేజ అలియాస్ సాయి గా గుర్తించారు.హరిత కుటుంబ సభ్యులను అవమానపరిచామని విచారణలో ఒప్పుకున్నారు నిందితులు.
విజయవాడ మొగల్రాజాపురంలోని ఓ బిల్డింగ్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి,హైదరాబాద్, భేగంపేట కేంద్రంగా రికవరీ ఏజెన్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.బేగంపేట ఏజెన్సీ మేనేజర్ బూరుగు మాధురిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వీరిని మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.