నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : అంబటి రాంబాబు

-

నీటి పంపకాల విషయంలో రాజీ పడేది లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనమే సీఎం జగన్ కి ముఖ్యమని పేర్కొన్నారు. తాజాగా మంతి అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రైతుల పాలిట ద్రోహిగా నిలిచిపోయారు. కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ తప్పుడు కథనాలు వద్దని తెలిపారు అంబటి రాంబాబు.

మన నీటిని సద్వినియోగం చేసుకోలేక పోవడానికి చంద్రబాబు కారణమన్నారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి సీఎం జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంది. నీటి పంపకాల విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీటి గురించి తప్ప మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడారు. మరీ నీటి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని నీవు పార్టీలో నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వారు కూడా తరువాత పార్టీలో ఉండరు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news