రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ జగన్. మంత్రి నారా లోకేష్ ని పప్పు అనడంలో అసలు తప్పే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని జీజీహెచ్ లో సహాన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశాచట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, లోకేష్ దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో దిశ యాప్ తో10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాం అని తెలిపారు. దిశ యాప్ కి 19 అవార్డులు వచ్చాయి. దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా..? దిశా యాప్ ను పని చేయకుండా చేయడం దారుణం అన్నారు.