రూ. 300 కోట్లు స్కాంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి?

-

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిన్నటి నుంచి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మెడకు రూ.300 కోట్ల స్కాం చుట్టుకుంది. పటాన్‌చెరు BRS ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో సోదాలకు సంబంధించి ఈడీ అధికారిక ప్రకటన చేసింది.

MLA Mahipal Reddy shed tears

సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారని తెలిపింది. డబ్బును స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని, పలువురు బినామీలుగా ఉన్నట్టు తేలిందని ED వివరించింది.

ఈడీ అధికారుల సోదాలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ని అడిగి వివరాలు తెలుసుకున్న హరీష్ రావు…అనంతరం మాట్లాడారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి…. మహిపాల్ రెడ్డి గారి నివాసంలో కనీసం డబ్బు, బంగారం కానీ అక్రమంగా దొరకలేదని వెల్లడించారు. ప్రతిదీ ఐటీ రిటర్న్స్‌తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news