గత నెల రోజుల నుంచి తరుచూ ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మానవ జీవితంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమే కానీ.. ఈ నెల రోజుల కారణంగా తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చేటు చేసుకోవడం విశేషం.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మిని బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొక 10 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. గాయపడిన కదిరి ఆసుపత్రికి తరలించారు. పులగంపల్లి నుంచి 15 మంది గ్రామస్తులు తిరుమల వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.