మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేశామా..? అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. పోలవరానికి ఉరి అని.. 45.72 మీటర్లకు నీరు నిలపగలిగితేనే నదుల అనుసంధానం కుదురుతుంది. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాసినప్పుడు వ్యతిరేకించామన్నారు. 41.15కి తగ్గిస్తే.. ప్రాజెక్టు కాస్త బ్యారేజీగా మారిపోతుందని మేము పేర్కొన్నాం.
2014-19 మద్యలో మేము ఎప్పుడూ ఎత్తు తగ్గించాలని అడగలేదు.. 55,548 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందింది. పోలవరం ప్రాజెక్ట్ ప్రభుత్వం మారడంతోనే పోలవరానికి గ్రహణం, గండం, పట్టాయి. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యదాస్ రాసిన లెటర్ లో చాలా క్లియర్ గా ఫేజ్-1, ఫేజ్-2ల గురించి చెప్పారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 04-05-2023న శశిభూషణ్ రాసిన లేఖలో 41.15 మీటర్లకు తగ్గించి త్వరగా పూర్తి చేసేందుకు అనుమతులు కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నేవిగేషన్ సిస్టంలకు సంబంధించి ప్రిన్సిపుల్ తీసేసి అనుమతులు ఇవ్వాలని కోరారు.