చంద్రబాబు కు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. దేశంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కానీ వాలంటీర్లకు గౌరవం అదనం. ఒక తాత్కాలిక సచివాలయం చంద్రబాబు కడితే.. సీఎం జగన్ పాలనలో 11వేల వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకుందని తెలిపారు.
పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పరిచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా ప్రభుత్వ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు పరిచిందని గుర్తు చేశారు. అంబేద్కర్ పై ఉన్న గౌరవానికి సూచనగా స్మృతి వనం ఏర్పాటు చేశారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతులను చాలా ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుత సీఎం జగన్ తో పోల్చితే.. చంద్రబాబు ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చాలా తక్కువ అన్నారు.