ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు చెక్ పడటం ఖాయమే…!

-

2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్ళిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు టీడీపీని వీడి, జగన్‌కు జై కొట్టారు. ఎమ్మెల్యే పదవి పోకుండా అధికారికంగా వైసీపీలో చేరకుండా, అనధికారికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండే ఈ నాలుగేళ్ళు వారు బాగానే అధికార నేతలుగా చెలామణి కానున్నారు.

అయితే నెక్ట్స్‌ ఎన్నికల్లో వీరు వైసీపీ నుంచి బరిలో దిగితే గెలుపు అనేది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిపై ఇప్పటికే నియోజకవర్గంలో వ్యతిరేకిత మొదలైనట్లు కనబడుతోంది. మామూలుగానే గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోటగా ఉంది. 2014లో ఇక్కడ టీడీపీ తరుపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల సమయంలో మోదుగుల వైసీపీ వైపున‌కు వెళ్లడంతో, చంద్రబాబు మద్దాలి గిరిని వెస్ట్ బరిలో దించారు.

ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే వెస్ట్‌లో టీడీపీకి ఉన్న బలంతో మద్దాలి గిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి కొంతకాలం టీడీపీలో యాక్టివ్‌గా నడిచిన మద్దాలి..సడన్‌గా టీడీపీని వీడి వైసీపీకి మద్ధతు తెలిపారు. అయితే వైసీపీ వైపు రావడం వల్ల వ్యక్తిగతంగా ఆయనకు ఏమన్నా లబ్ది జరిగిందేమో గానీ…రాజకీయంగా మాత్రం పెద్ద బెన్‌ఫిట్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే వెస్ట్‌ ఎలాగో టీడీపీకి కంచుకోట. పైగా రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న ప్రాంతం.

ఇక్కడ ప్రజలు మూడు రాజధానులని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు..యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెస్ట్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ నాలుగేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో గిరి బండిని ఎలా లాగుతారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. అస‌లే రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రింత ఎక్కువుగా క‌నిపిస్తోంది. మొత్తానికి ఎన్నో ఆశ‌ల‌తో పార్టీ మారినా గిరికి ఆ ప్ర‌యోజ‌నం క‌న‌ప‌డ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news