రష్యా దేశం ఇటీవలే విడుదల చేసిన తన స్పుత్‌నిక్-వి కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను మరో వారం, పది రోజుల్లో 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించనుంది. అక్కడి టాస్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. 3వ దశ ట్రయల్స్‌లో వేల మంది పాల్గొననున్నారు. ఇప్పటికే ఆ వ్యాక్సిన్‌ను రష్యా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. తాజాగా మొదటి బ్యాచ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేశారు.
రష్యా రక్షణ విభాగంతోపాటు అక్కడి గమాలియా రీసెర్చ్ ఇనిస్ట్యూట్‌లు కలిసి ఆ వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ క్రమంలో ఆ ఇనిస్టిట్యూట్ వారు మరో వారం, పది రోజుల్లో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారు. ఆ ట్రయల్స్ లో పాల్గొనేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారని అక్కడి ప్రముఖ సైంటిస్టు ఒకరు తెలిపారు. దీనికి గాను రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ ఇప్పటికే విడుదలైంది కనుకనే దీన్ని అనేక మంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
కాగా రష్యాలో ఇప్పటి వరకు 9,17,884 కరోనా కేసులు నమోదు కాగా, 15,617 మంది చనిపోయారు. 7,29,411 మంది కోలుకున్నారు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పట్ల పలు ఇతర దేశాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. అయితే భారత్ ఆ వ్యాక్సిన్‌కు నిర్వహించిన ఫేజ్ 1, 2 ట్రయల్స్ డేటాను తీసుకునే పనిలో పడింది.