విశాఖ జూ పార్కులో వెకిలి చేష్టలకు పాల్పడ్డ ముగ్గురు యువకుల అరెస్ట్

విశాఖ జిల్లాలోని జూ పార్క్ లో ముగ్గు రు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. జూ పార్క్ లో అడవి పందుల ఎన్ క్లోజర్లోకి దూకి వీడియోలు తీశారు.వన్యప్రాణులను రెచ్చ గొట్టి సరదా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారు యువకులు.ఆ వీడియో లను లైక్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యారు యువకులు.

జూ ఉంది జంతువుల పై అవగాహన పెంపొదించుకోవడం కోసమే కానీ ఇలాంటి అరాచకాలకు కాదన్నారు జూ క్యూరేటర్ నందిని సలారియ.ఇలాంటి నేరాలకు 6 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు.క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వీటి వల్ల యువకుల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.జూ సెక్యూరిటీ వైఫల్యం గా కూడా దీన్ని చూస్తున్నామని, సెక్యూరిటీ ఏజెన్సీ కి కూడా నోటీస్ లు ఇచ్చామన్నారు జూ క్యురేటర్ నందిని సలారియా.