గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు లో మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ కి ఎన్నో అవమానాలు జరిగాయని మండిపడ్డారు అచ్చన్న. వైసిపి ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఎన్టీఆర్ కీ తరచూ ఇలా అవమానం జరుగుతుందని అచ్చేనాయుడు పేర్కొన్నారు.
” ఎన్టీఆర్ విగ్రహాలకు గతంలో వైసిపి నేతలు నిప్పు పెట్టడంతో పాటు పట్టపగలే దాడి చేశారు. వారిపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఘటన జరిగినప్పుడే కఠినంగా చర్చించి ఉంటే నేడు ఈ అవమానం జరిగేది కాదు. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరిగితే మా స్పందన మరోలా ఉంటుంది. ప్రభుత్వానికి మహానేత ఎన్టీఆర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి ” అంటూ అచ్చన్న ఘాటుగా స్పందించారు.