నేటితో ముగియనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

-

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఈరోజు ఉదయం చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని వేద పండితులు వివరించారు.

ఇవాళ శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వర్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. . ఈ కార్యక్రమం అనంతరం పుష్కరిణిలో భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా చివరి రోజైన నేడు భారీగా భక్తులు తరలివచ్చారు. వేంకటేశ్వర స్వామి నామస్మరణతో.. గోవింద నామాలతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి. తిరుమల కొండ మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

కలియుగ దైవంగా భావించే వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కృపకటాక్షం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి సేవ చేస్తే ఆ తిరుమలేశుడి కృప తమపై ఎల్లవేళలా ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version