దీపావళి ఎఫెక్ట్‌..తిరుమలలో భారీగా రద్దీ..దర్శనాలకు ఎంత టైం అంటే ?

-

దీపావళి ఎఫెక్ట్‌..తిరుమలలో భారీగా రద్దీ స్పష్టం గా కనిపిస్తోంది.. తిరుమల శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలోనే నిన్న ఒక్కరోజున తిరుమల శ్రీవారిని 55 వేల 219 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది.

tirumala on oct 31st

అలాగే నిన్న ఒక్కరోజు… 16, 211 మంది…. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… నిన్న ఒక్కరోజున 4.37 కోట్లుగా నమోదు అయింది. ఇక దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో విపరీతంగా భక్తులు… ఈ వారం రోజుల పాటు ఉంటారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక అటు తిరుమలలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఉంది. ఈ తరుణంలోనే ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ… ఈ మేరకు ప్రకటన చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news