తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న పుష్పయాగం నిర్వహించనున్నట్లు టిటిడి తెలిపింది. ఇందులో పాల్గొనే భక్తుల కోసం 1000 టికెట్లను నేడు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. టికెట్ ధరను రూ.700గా నిర్ణయించింది.
కాగా…. ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా..శ్రీవారి సన్నధి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారిని 66,048 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు 24,666 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.25 కోట్లుగా నమోదు అయింది.