ఇవాళ 9వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర… షెడ్యూల్ ఇదే

-

9వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. నిన్న బ్రేక్‌ తీసుకున్న జగన్‌.. ఇవాళ మళ్లీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించనున్నారు. ఇందులో భాగంగానే..ముఖ్యమంత్రి జగన్ ఉదయం 9 గంటలకు నెల్లూరు పరిధిలోని చింతారెడ్డి పాలెంలో బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు.

Today CM Jaganmohan Reddy’s bus trip will break

జనార్దన్ రెడ్డి కాలనీ..కోవూరు క్రాస్ , సున్నపుబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి సమీపంలోని జాతీయ రహదారి వద్ద సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news