చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. దీంతో ఈ దీక్షలకు హాజరుకాకుండా నాయకుల ఇళ్ల వద్ద భారీగా చేరుకున్నారు ఏపీ పోలీసులు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి..నారాయణ…టీడీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
ఏపీలోని అన్ని జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉండడంతో ఎలాంటి నిరసనలు… ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ…నిరాహార దీక్షలకు సన్నద్ధం అవుతున్నారు టీడీపీ నేతలు. అలాగే, శాంతియుత ర్యాలీలకు, నిరసనలు చేపట్టనున్నారు.