విజయవాడ సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి చంద్రబాబును విచారిస్తున్నారు దర్యాప్తు అధికారులు. మరోవైపు కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు నిన్న చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన నారా భువనేశ్వరి, లోకేష్ ను లోపలికి అనుమతిచ్చారు పోలీసులు. చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫర్మిషన్ ఇచ్చారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా విజయవాడకు రోడ్డు మార్గం ద్వారా నిన్న రాత్రి బయలు దేరారు. ఈ తరుణంలోనే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను పోలీసులు ఏపీలో అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేసి..ఆయన పార్టీ కార్యాలయానికి తరలించారు పోలీసులు.