కడప జిల్లా పులివెందులలో విషాదం చోటు చేసుకుంది. పింఛన్ కోసం వెళ్లి మరో వృద్ధురాలు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా పులివెందులలో పింఛన్ కోసం వెళ్లి నేలకొరిగింది వృద్ధురాలు. సింహాద్రిపురం మండలంలో మడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70) బుధవారం పింఛన్ కోసం సచివాలయానికి వెళుతూ దారిలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయింది.

దీంతో వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది మడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70). దీంతో మడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన బయటకు రావడంతో.. తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీనే మడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70) మరణానికి కారణం అంటున్నారు.