ట్రెండ్ ఇన్ : ఉద్యోగుల సమ్మె

-

ఉద్యోగుల స‌మ్మెకు సంబంధించి ఓ స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది సంబంధిత వ‌ర్గాల నుంచి.! వ‌చ్చే నెల ఆరో తారీఖు అర్ధ‌రాత్రి నుంచి వీళ్లు స‌మ్మెకు వెళ్ల‌నున్నార‌ని నిర్థార‌ణ అయింది. దీంతో రాష్ట్రంలో మ‌ళ్లీ ఓ అనిశ్చితి నెల‌కొని ఉంది. స‌మ‌స్య ఎలా ప‌రిష్క‌రించాల‌న్న విష‌య‌మై ఓ వైపు ఉద్యోగ వ‌ర్గాలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంటే, ఇదే స‌మ‌యంలో వీరికి ఏ విధంగా స‌ర్ది చెప్పి దార్లోకి తీసుకు రావాలి అన్న విష‌య‌మై ప్ర‌భుత్వం కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇక హైకోర్టులో కూడా ఇవాళ ఇందుకు సంబంధించిన రిట్ పిటిష‌న్ ఒక‌టి మూవ్ అయింది. దీనిపై కోర్టు కూడా కాస్త సీరియ‌స్ అయింది. స‌రైన ఆధారాలు లేకుండా జీతాలు త‌గ్గాయ‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు అంటూ ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం పిటిష‌న‌ర్లు కొంద‌రు కోర్టు కు వెళ్లి త‌మ వాద‌న‌లు మ‌రియు అభ్యంత‌రాలు చెప్పారు. వారి ఇచ్చిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

“అశుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు ఆధారంగా పే రివిజన్స్ జరగలేదని, ఆ నివేదికను ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని దీనిపై ప్రజాధనాన్ని(Public money) ని ఖర్చు చేయడం జరిగిందని, ప్రస్తుతం పే ఫిక్సేషన్ చేసి జనవరి జీతాలకు సంబంధించిన బిల్లుల ను సిద్ధం చేసేందుకు, ఆ వెంటనే జీతాలను రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, దానికి తగ్గ ఉత్తర్వులు ఆర్థిక శాఖ నుండి వెలువడ్డాయని. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందని కాబట్టి ఉత్తర్వులను స్టేచేయాలని .. ఇలా అనేక అంశాలపై చాలా విస్తృతంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు.

మధ్యాహ్నం భోజ‌న విరామం అనంతరం కూడా వాద‌న‌లు కొన‌సాగాయి. హైకోర్టులో పిటిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ గజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షులు కృష్ణయ్యకు మరియు మిగిలిన జేఏసీల నాయకులకు కూడా త‌మ త‌మ అభ్యంత‌రాలు వినిపించారు. సీఎస్ ను కూడా పిలిచారు కానీ ఆయ‌న అందుబాటులో లేరు. ఢిల్లీలో ఉన్నారు. లంచ్ తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ/GAD సెక్రటరీ అయిన శశి భూషణ్ హాజ‌ర‌య్యారు.

ఈ పిటిషన్లో కేవలం ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ అంశాలే కాక, ప్రజా ప్రయోజనాలు(Public Interest) కూడా ఇమిడి ఉన్నందున ఈ పిటిషన్ విచారణ పరిధి తమకు లేదని., దానిని గౌరవ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ నకు రెఫర్ చేస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చారు.” అని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Read more RELATED
Recommended to you

Latest news