ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల రోజులు పిఆర్సి పై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో పీఆర్సీ కోసం పోరాటం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏపీ ఉద్యోగులకు ఏకంగా 23 శాతం పీఆర్సీని ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో రెండురోజులు చల్లబడ్డ ఏపీ ఉద్యోగులు… అనంతరం మరోసారి సమ్మెబాట పట్టేందుకు ప్రయత్నించారు.
పిఆర్సి ఉత్తర్వులను సర్కారు వెనక్కి తీసుకోవాలని కొత్త డిమాండ్ ను జగన్ ప్రభుత్వం ముందు పెట్టారు ఉద్యోగులు. లేకపోతే ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన జగన్ సర్కార్… ఉద్యోగులతో చర్చలు జరిపి వారిని తమ దారికి తెచ్చుకుంది. దీంతో నిన్న రాత్రి ఈ వివాదం సమసిపోయింది. అయితే.. ఏపీ ఉద్యోగుల సంఘాల నేతలపై ఉపాధ్యాయ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ముందే సమ్మె విరమించాలని ఉపాధ్యాయులు ఉదయం నుంచి ఆవేశంలో ఉన్నారు. అయితే పిఆర్సి సాధన సమితి నేతల పై కోపంగా ఉన్న కొంతమంది… వారి శ్రద్ధాంజలి చేసినట్లుగా ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.