తిరుమలకు పొటెత్తిన భక్తులు..దర్శనానికి ఎంత సమయం అంటే ?

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని 31 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 77, 878 మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో 30, 140 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.46 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

వేసవి సెలవులు ముగిసి… విద్యాసంస్థలు ప్రారంభం కానున్న తరుణంలో… తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిన్న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వసతి గదల కోటాను అందుబాటులో ఉంచారు టీటీడీ అధికారులు. టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే భక్తులు పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకున్నారు.

  • తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77878 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 30140 మంది భక్తులు
  • హుండి ఆదాయం 4.46 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news