TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. అలాగే ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కేట్లు, వసతి గదులు కోటా విడుదల కానున్నాయి.

అంతేకాకుండా…ఏప్రిల్ నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల వసతి కోట టోకెన్ రిలీజ్ చేస్తామని తెలిపింది.
తిరుమలలో ఎల్లుండి రామకృష్ణ తీర్ద ముక్కోటి జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఎల్లుండి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడి. ఎల్లుండి పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. దీంతో రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.