గణతంత్ర వేడుకల్లో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం

-

దిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం ప్రదర్శనకు ఎంపికైంది.  సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడం వల్ల ఈ అవకాశం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండేళ్లు సైతం తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్రం అనుమతించిందని తెలిపారు.

స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి తెలిపేలా శకటాన్ని రూపొందించినట్లు సమాచారం. నిరంకుశ విధానాలు, రాచరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి యోధుల విగ్రహాలను శకటంపై ప్రదర్శించనున్నారు. పోరాట యోధుల త్యాగాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. జానపద కళాకారుల ప్రదర్శన కూడా ఉంటుందని చెప్పారు. సామాజిక, ఆర్థిక న్యాయం, గౌరవనీయమైన జీవనం, అవకాశాల కల్పన, వ్యక్తిగత గౌరవాలు వంటి విషయాలు అర్థం అయ్యే రీతిలో శకటంలో ఆకృతులు ఏర్పాటు చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనకు కేంద్రం అవకాశం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news