ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఏపీ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు… ఏపీ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడికి దిగారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ బస్టాండ్ లో బస్సుకు అడ్డుగా పెట్టిన కారును పక్కకు తీయమని హారన్ కొట్టినందుకు బూతులు తిడుతూ సిరివెళ్ళ రాకేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేశారు ఇద్దరు యువకులు.
శుక్రవారం సాయంత్రం ఘటన జరగగా ఫిర్యాదు చేసినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి.