విజయవాడ అమ్మవారి భక్తులకు అలర్ట్…ప్రోటోకాల్ దర్శనాలు రద్దు అయ్యాయి. మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటారు… ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామన్నారు విజయవాడ ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈ ఓ రామారావు. జులై 6 నుంచీ 15వరకూ వారాహి నవరాత్రులు జరుగుతాయని…. 14న మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు.
కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ తరుణంలోనే… 11:45 నుంచీ 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది… 11:30 నుంచీ 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని వెల్లడించారు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విజయవాడ అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పించబోతున్నట్లు విజయవాడ ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈ ఓ రామారావు ప్రకటించారు. కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని… వారాహి నవరాత్రులు వస్తున్నాయని చెప్పారు ఈ ఓ రామారావు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని పేర్కొన్నారు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు… ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.